అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి వద్ద నార్కెట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జాతీయ రహదారి నుంచి కవాడి పల్లి గ్రామంలోకి మలుపు తిరుగుతున్న ఇసుక లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు చేపట్టారు.




