హైదరాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలు,వరదల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ,వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపాయని వర్షాలు తగ్గుముఖం పట్టినా,పంట నష్టం భారీగానే ఉందని సీఎస్ సీఎంకు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ,1020 చెరువులకు గండ్లు పడ్డాయని చెప్పారు. 21,682 ఇళ్లు ధ్వంసమయ్యాయని సీఎస్ వెల్లడించారు.




