42వ డివిజన్ లో ఘనంగా బి ఆర్ ఎస్ సంబరాలు..

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21 (జనం సాక్షి)వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి నన్నపనేని నరేందర్ పేరు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో 42 వ డివిజన్ లో నెహ్రు సెంటర్, మరియు గవిచర్ల, కూడలిలో డీజే, టపాసుల మొతతో బిఆర్ఎస్ పార్టీ బృందం అంత అంగరంగ వైభావంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇందులో డివిజన్ మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్దన్ , డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్, కత్తి ఎల్లగౌడ్, అవునూరి లక్ష్మి, మండల సురేష్, పాలకుర్తి సుమన్,డివిజన్ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..