ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
17న ఓట్ ఆన్ అకౌంట్
న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) :
పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 21 వరకు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోనే అనేక కీలక బిల్లులను పార్లమెంట్ ముందుకు తేవడానికి యూపీఏ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ ముసాయిదాను కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టిన పార్లమెంట్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఉంచింది. రాష్ట్రపతి నుంచి ముసాయిదా రాగానే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈనెల 17న ఓట్ ఆర్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి పార్లమెంట్ సమావేశాలు ఇవే. వికలాంగుల సంక్షేమానికి ఉద్దేశించిన బిల్లును కూడా ఈ సమావేశాల్లో పార్లమెంట్ ప్రవేశపెట్టి ఆమోదింపజేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యం గల రాహుల్‌గాంధీ మానస పుత్రికగా చెప్పే అవినీతి నిరోధక (సవరణ) బిల్లు, విజిల్‌బ్లోయర్స్ ప్రొటెక్షన్ బిల్లు, జుడిషియల్ అకౌంటబిలిటీ బిల్లు, టైమ్‌లీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ బిల్లు, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ తదితర బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించేలా కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే, కేజ్రీవాల్‌కు ప్రతిగా పోరుడుతున్న నాయకుడిగా రాహుల్‌గాంధీ ప్రతిష్ట ఇనుమడింపజేయాలంటే ఈ సమావేశాల్లో అవినీతిరి నిరోధక బిల్లును సవరణ ముసాయిదాను ఎలాగైనా సభ ఆమోదించేందుకు చర్యలు చేపట్టింది.
ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంట్




