అగ్ని-5 క్షిపణిని మరోసారి పరీక్షించిన రక్షణశాఖ

బడిశా: అగ్ని-5 క్షిపణిని రక్షణశాఖ మరోసారి పరీక్షించింది. ఒడిశాలోని భద్రక్‌ జిల్లా వీలార్‌ ఐలాండ్‌ నుంచి అగ్ని-5ను ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని అక్ష్యాన్ని ఛేదించగలదు. అగ్ని-5 క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.