50 వేలకు యువతి అమ్మకం

akshaya

థానె: ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మరో యువతిని తీసుకెళ్లి 50 వేల రూపాయలకు అమ్మేసింది. ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమబెంగాల్కు చెందిన ఓ మహిళకు (24) నెలకు 20 వేల రూపాయల జీతంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గత నెలలో థానెకు తీసుకువెళ్లింది. భీవాండిలోని ఓ వ్యభిచార గృహానికి ఆమెను అమ్మేసింది. ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేర్చారు. కొందరు సామాజిక కార్యకర్తలను బాధితురాలిని రక్షించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.