59 జీవో లో దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన.

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.జులై10
59 జీవో క్రింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డిమాండ్ నోటీసు ప్రకారం డబ్బులు చెల్లించాలని మల్కాజిగిరి తహసిల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం మండల కార్యాలయంలో 59 జీవో క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. 59 జీవో కింద దరఖాస్తు చేసుకున్న ప్రజలకు అశాస్త్రీయంగా లక్షల రూపాయలు కట్టాలని నోటీసులు పంపించడం దారుణమని దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారమే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటి సర్వే నిర్వహించి నోటీసులు అందజేశామని,
మూడు విడతలుగా డిమాండ్ నోటీసులో పొందుపరిచిన విధంగా డబ్బులు చెల్లించాలని తెలిపారు.డబ్బులు చెల్లించని వారి ఇండ్ల స్థలాల పై ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.ఇచ్చిన గడువు లోగా డబ్బులు చెల్లించి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.

తాజావార్తలు