Tuesday, 3 November 2026

6 నుంచి 23 వరకు ఉచిత ఆరోగ్యశ్రీ శిబిరాలు

నల్గొండ, జనవరి 31 ():  జిల్లాలో ఉచిత రాజీవ్‌ ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ ఎన్‌.నాగరాజుకుమార్‌ తెలిపారు. ఈ శిబిరాలను 6 నుంచి 23 వరకు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. 6వ తేదీన ఆలేరు మండలం కేంద్రంలోని పొచమ్మగుడి దగ్గర, 9న చిట్యాల మండల కేంద్రలోని హైస్కూల్‌, 15న పెద్దవూర మండలం నెల్లికల్‌ పంచాయతీలో, 23న నూతన్‌కల్‌ మండల కేంద్రంలోని హైస్కూల్‌లో జరిగే శిబిరాలు సద్వినియోగం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *