హైదరాబాద్: ఈ నెల ఆరోతేదీన ఎల్బీ స్టేడియంలో తెలంగాణ యుద్ధ భేరిసభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం సీమంధ్రలో సాగుతున్న సమ్మె నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆర్టీసీని మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ,మంగళ, బుధవారాల్లో సీమాంధ్రలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మెనుంచి స్కూళ్లు, ఆర్టీసీని మినహాయించుకుంటే ఈ నెల 7న ఏపీఎనీవోలు హైదరాబాద్‌లో సమైక్యసభ నిర్వహించు కునేందుకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని కోరారు.




