సికింద్రాబాద్,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులోని సిటీలైట్ హోటల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో రాజు, మురళి, సంతోష్, నన్నులను గుర్తించారు. పోలీసు యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. సహాయ సిబ్బంది చిక్కుకున్న వారిని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. రెండంతస్తుల భవనం కావడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఆరు పొక్లెయన్లు, భారీ క్రేన్ల సాయంతో శిథిలాల తొలగింపు ముమ్మరంగా కొనసాగుతుంది. నగర పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
సికింద్రాబాద్‌లో కూలిన సిటీలైట్ హోటల్ భవనం




