హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సానథనికంగా సంచలనం సృష్టించింది. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయంపై నుంచి దూకి ఆమె ఈ ఘటనకు పాలప్పడింది. మృతురాలు బెంగళూరుకు చెందిన అశ్వినీ నాయర్. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని, జీవితంపై విరక్తి చెందే ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు ఆమె తన డైరీలో పేర్కొన్నట్లు సమాచారం.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అశ్దినీ నాయర్ గత 24న ఉద్యోగంలో చేరింది. గతంలో కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు అశ్వినీ నాయర్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కొద్ది నెలల క్రితం నీలిమ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కూడా ఇన్ఫోసిస్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.




