ముషీరాబాద్(హైదరాబాద్): సిటీలైట్ హోటల్ భవనం కుప్ప కూలిన ఘటనలో మృతచెందిన 13 మందిలో అరుగురి మృత దేహాలు గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నాయి. బంధువులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలోనే భద్ర పరిచినట్లు ముషీరాబాద్, షేక్ పేట తహశీల్దార్‌లు సుజాత, చంద్రకళ తెలిపారు.




