హైదరాబాద్: తపాలశాఖలో పనిచేస్తున్న గ్రూప్-డి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. ఒక్క రోజు విధుల బహిష్కరించిన ఉద్యోగులు అబిడ్స్‌లోని డాక్ సదస్ ఎదుట ధర్నా నిర్వహించారు. తపాలాశాఖలో గ్రూప్-డి విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి శాస్త్రీయ పద్దతిలో లెక్కగట్టి పని భారమును నిర్ణయించాలని సంఘం నాయకులు కోరారు. అర్హత గల ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు.




