దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో 16వ నెంబరు జాతీయ రహదారిపై దెందులూరు-సత్యనారాయణపురం గ్రామాల మధ్య కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా హైదరాబాదులోని బోయినపల్లి ప్రాంతానికి చెందిన పచ్చళ్ల ప్రదీప్‌రెడ్డి, టి.హరివిఠల్ ,సంజయ్, రాజులుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




