Tuesday, 3 November 2026

సౌదీలో యువరాణి అరెస్టు

కాలిఫోర్నియా: సౌదీ యువరాణి మేషల్‌ అలెబాన్‌ (42) బుధవారం అరెస్టయ్యారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న అమె ఒక మహిళను అక్రమంగా తరలించడమే కాక అమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్భంధించినట్లు అరోపణలు ఎదుర్కొంటన్నారు. ఆ మహిళతో బలవంతంగా పనిచేయించుకుంటున్నారని రాకుమారిపై నేరం నమోదైంది. కెన్యాకు చెందిన 30 ఏళ్ల మహిళను రాకుమారి అక్రమంగా కాలిఫోర్నియా తీసుకొచ్చారు. అనంతరం అమె పాసుపోర్టు లాక్కొని, నిర్భంధంలో ఉంచి పని చేయించుకుంటున్నట్లు బాధిత మహిళ అధికారులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువైతే రాకుమారికి 12 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చని న్యాయవాదులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *