Tuesday, 3 November 2026

ఆస్పత్రి నుంచి హృతిక్‌ రోషన్‌ డిశ్చార్జ్‌

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ను గురువారం ఉదయం హిందూజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. తాను బ్రహ్మాండంగా ఉన్నానని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన హృతిక్‌ ఫోటోలకు పోజిస్తూ తెలిపాడు. సబ్‌ డ్యూరల్‌ హెమటోమా వ్యాధితో బాధపడుతున్న హృతిక్‌ కు జూలై 6 తేదీన బ్రెయిన్‌ సర్జరీ సంగతి తెలిసిందే.
బ్యాంగ్‌ బ్యాంగ్‌ సినిమా షూటింగ్‌ పోరాట సన్నివేశాల్లో హృతిక్‌ గాయపడగా, మెదడు పై పొరల్లో రక్తం గడ్డ కట్టింది. హృతిక్‌ను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేశారు. హృతిక్‌ కు నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్యాంగ్‌ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *