జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

రాంఛీ,(జనంసాక్షి): ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరింది. జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ హేమంత్‌ సోరెన్‌తో గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ- జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలల క్రితం కూలిపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెస్‌ మద్ధతుతో జేఎంఎం సర్కారును ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కావడంతో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు.