హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు సంబంధించి ఫోరెన్సిక్ విభాగం జాతీయ దర్యాప్తు సంస్థకు నివేదిక సమర్పించింది. పేలుడు జరగడానికి ముందు సీసీ టీవీలో ఉన్న దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ విభాగం నిపుణులు పేలుళ్లకు కుట్ర పన్నింది తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ అని తేల్చారు. పేలుడు జరగడానికి కొద్ది సేపు ముందు యాసిన్ భట్కల్ స్వయంగా ఘటనాస్థలం వద్దకు సైకిల్‌పై వచ్చినట్లు వారు గుర్తించారు. సైకిల్ వెనుక భాగంలో భారీ సంచి కూడా తగిలించి ఉన్నట్లు నిర్ధారించారు. మరో వ్యక్తిని తెహసీన్ అక్తర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




