ఒంగోలు,(జనంసాక్షి): ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్స్ రైల్లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో స్టేషన్ అధికారులు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చెన్నై- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే గూడ్స్ రైల్లో మంటలు ఎలా వ్యాపించాయి అనే విషయంలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




