హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ సంజీవరెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేంశంలో తెలంగాణ పరిష్కారం దొరక్క పోవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీడబ్ల్యూలో చెబుతానని సంజీవరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బదులుగా ప్యాకేజీ ప్రకటించాలని సిఫారసు చేస్తానని సంజీవరెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల ప్రతిఘటన కారణంగా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చనని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల తెలుగు ప్రజల మధ్య కూడా విభేధాలు తీవ్రం అవుతాయన్నారు.




