Tuesday, 3 November 2026

‘ఈల’ వేయనున్న కన్నడ నటుడు సుదీప్‌

హైదరాబాద్‌: రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు సుదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఈల’ కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే పేరుతో సుజాత ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘దండుపాళ్యం’ ఫేం పూజాగాంధీ కథానాయికగా నటించిన ఈ చిత్ర పాటలను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. నెలాఖరుకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *