Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, హైకోర్టు న్యాయమూర్తిలు జస్టిన్‌ ఎస్‌.వి. రమణ , జస్టిన్‌ కేసీ భానులకు ఆయల సంప్రదాయంతో తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని  దర్శించుకున్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి జ్యోతిసేన్‌ గుప్తా ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *