యాదగిరి: త్వరాలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆయన కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. దైవదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్టానికి సానుకూలంగానే వ్యవహరిస్తోందని, కాలయాపనకు సీమింధ్ర నాయకులే కారణమని ఆరోపించారు.




