రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో కొత్త మంజూరైన అదనపు జిల్లా కోర్టును రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా అదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజలకు అనుగుణంగా రాష్ట్రంలో కోర్టులు అందుబాటులో లేవని, అదనపు కోర్టులు, సిబ్బందిని నియమించాల్సి ఉందని అన్నారు. న్యాయవాదులు పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జీ రమణ, మరణ, చిత్తూరు జిల్లా జడ్జి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.




