ఫిలింనగర్, న్యూస్టుడే: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వందలాది కిలోల కూరగాయలతో అలయ ప్రాంగణాన్ని, ముఖద్వారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం 3 గంటలకు పెద్దమ్మవారకి అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8 గంటలకు పల్లకిసేవ జరుగుతుందని అలయ కార్యనిర్వాహణాధికారి ఎ. బాలాజీ తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.




