Tuesday, 3 November 2026

ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో తొక్కిసలాట…18 మంది మృతి

జకర్తా : తూర్పు ఇండోనేషియా నబిరే పట్టణంలోని కోటలామ బాక్సింగ్‌ స్టేడియంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానిక బాక్సర్లు ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో వారి మద్ద తుదారులు స్టేడియంలో అల్లర్లకు దిగడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో 12 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ 40 మందిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, సైన్యం స్టేడియానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *