Tuesday, 3 November 2026

పొన్నం, పాల్వాయిలపై విష్ణు ఆగ్రహం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, పాల్వాయిల గోవర్ధన్‌లపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ బలహీనపడిందని వారు దుష్పప్రచారం చేస్తున్నారన్నారు. ఈ అంశాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కోరారు.
కేసీఆర్‌ మతిస్థిమితం కోల్పోయి కాంగ్రెస్‌ టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు. చిన్న అంశాలనే రెచ్చ గొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే లాభపడేది నేతలేనన్నారు. అభివృధ్ది ప్యాకేజీ ఇస్తే తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *