Tuesday, 3 November 2026

భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగిటం వల్ల నిలిచిన రాకపోకలు

జైనూరు: ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి మండలంలోని పానాపటార్‌, లెండిగూడ, కిషన్‌నాయక్‌ తండ గ్రామ పొలిమేరల్లో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సమీపంలోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లెండిగూడ, పానాపటార్‌ గ్రామాల వాగుల్లో లోలెవెల్‌ వంతెనలు నిర్మించడంతో ఈ పరిస్థితి నెలకొంది. అడ్డెసారా, జెండాగూడ, జంగాం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో సాగుచేసిన పంటలు నీటమునిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *