Tuesday, 3 November 2026

ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చేందుకు చర్యలు: చిదంబరం

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదు అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 కంటే ఎక్కువగానే ఉంటుందని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. రిజర్వు బ్యాంకు చర్యల ప్రతిఫలంగా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయని భావించలేదని ఆయన పేర్కొన్నారు. విదేశాలలో మనం జరిపే లావాదేవీలపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆహార భద్రత పథకం అమలులో ఆకలి,పౌష్టికాహార లోపాలను సరిచేయవచ్చు అని తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొలుత ఆహార భద్రత ఆర్డినెన్సు పైనే చర్చ ఉంటుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *