కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బాబాజీనగర్‌లో గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. 15 ఏళ్లుగా తిరిగినా కులధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వారీ తీర్మానం చేశారు. కులధ్రువీకరణ పత్రం అందజేస్తేనే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని గ్రామస్థులు తెలిపారు.




