కోరుకొండ, తూర్పుగోదావరి: రాజమండ్రి -హైదరాబాద్ విమాన సర్వీసులకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆటంకం కల్గించాయి. రాజమండ్రి -హైదరాబాద్ స్పైన్‌జెట్ విమానం రాజమండ్రి నుంచి సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరింది. అలాగే జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసును మంగళవారం వాతావరణం అనుకూలించకపోవడంతో పూర్తిగా రద్దుచేసినట్లు రాజమండ్రి విమానాశ్రయ ప్రతినిధులు తెలిపారు.




