Wednesday, 4 November 2026

రోడ్డుపై కూలిన వృక్షం: స్తంబించిన ట్రాపిక్‌

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని బాగిరిసి పేట క్రాన్‌ రోడ్డు వద్ద పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు కూలింది. మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు ప్రక్కన ఉన్న చెట్లు కూలడంతో పరకాల-భూపాలపల్లి మద్య తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టుకు ఇరువైపుల రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రేగొండ ఎస్సై వెంకట్‌, తహశీల్దార్‌ ఆధ్వర్యంలో చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *