బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేమనపల్లి మండలంలోని రాచర్లపల్లి, నీల్వాయి, జాజులపేట, చల్లంపల్లి, తుంకుటం, దత్నాపూర్ గ్రామాలు జలమయమయ్యాయి. ప్రాణహితనది పొంగి పొర్లుతుండటంతో వేమనపల్లి మండలంలో దాదాపు 1500 ఎకరాల్లో పత్తి పంటనీరు మునిగింది. బీమిని మండలంలో బీమినివాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వెంకటాపురం వాగు పొంగి పొర్లుతుండడటంతో ఇళ్ల లోకి నీరు చేరింది.




