హైదరాబాద్: గురుపౌర్ణమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా అలయాలకు ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట సాయిబాబా అలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని సాయిబాబా అలయాలు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిలలాడుతున్నాయి. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్, వెంకటరమణ కాలనీ, ముజఫర్ నగర్ ప్రాంతాల్లో సాయిబాబా అలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నెల్లూరు నగరంలో ప్రముఖ గాంధీనగర్ సాయిబాబా మందిరంతోపాటు చిల్డ్రన్ పార్క్ సాయి అలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణ జిల్లాలో రెండో షిరిడీగా పిలుచుకునే గుడ్లవల్లేరు మండలం అంగలూరు జ్ఞానసాయి మందిరంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శాంతి హోమం నిర్వహించారు.




