Tuesday, 3 November 2026

ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉంది: బొత్స

హైదరాబాద్‌: భారీ వానలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉందని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన తెలిపారు. వర్షాలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని బొత్స సూచించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని, 1040 పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారులు ఏకగ్రీవంగా గెలిచారని బొత్స పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *