విశాఖ: కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట 108 సిబ్బంది వినూత్న నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి 108 ద్వారా అత్యవసర సేవలు చేస్తున్న తమను జీవీకే యాజమ్యానం, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ 108 సిబ్బంది ఉరితాళ్లను మెడకు వేలాడదీసుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.




