పాల్వాయ్: మధ్యాహ్నం భోజనం ప్రతి చోటా ఏదో ఒక రూపంలో సమస్యలు లేవనెత్తుతోంది. పిల్లల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. తాజాగా హర్యానాలోని పాల్వాయ్‌లో ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చచ్చిన బల్లి కన్పించడంతో పిల్లలు తల్లడిల్లి పోయారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తమకు ఆహారంలో చిన్నా చితకా క్రిమికీటకాలు తరచూ కన్పిస్తూనే ఉంటాయని పిల్లలు చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజనం తమ గ్రామంలో వద్దంటూ వారు ఆందోళన చేస్తున్నారు.




