Tuesday, 3 November 2026

పాతబస్తీలో డంప్‌ స్వాధీనం

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర  పోలీసులు పాతబస్తీలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా బుధవారం ఓ డంప్‌ను కనుగొన్నారు. అందులోని 400 జిలెటిన్‌ స్టిక్స్‌తోపాటు 250 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌ స్టేషన్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *