వరంగల్: నక్సలైట్లు తమ సోదరులేనని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. వ్యూహ బృందంలో తెలంగాణకు అనుకూలంగా 60 శాతం నిర్ణయం జరిగిందని వెల్లడించారు. రాయల తెలంగాణ లేదా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అంశాన్ని తేల్చేందుకే 90 రోజులు గడువు అని వివరించారు. సీమాంధ్ర నేతల రాజీనామాలు వారి వ్యక్తి గతమని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణను అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.




