Wednesday, 4 November 2026

మయన్మార్‌ క్యాబినెట్‌లో మార్పులు

యాంగాన్‌: మయన్మార్‌ క్యాబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయ వర్గాలు గురువారం వివరాలను వెల్లడించాయి. ప్రస్తుత క్యాబినెట్‌ నుంచి నలుగురు మంత్రులు రాజీనామాలు చేయగా, మరో ఇద్దరు ఉప మంత్రులు క్యాబినెట్‌ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో మరో పది మంది ఉప మంత్రులను నియమించినట్లు అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి. మంత్రులు రాజీనామా చేయడంతో కార్మిక, పారిశ్రామిక, ఉపాధి కల్పన , సాంఘిక సంక్షేమ, రైల్వే రవాణా తదితర శాఖలు మిగిలి ఉన్నాయి. మంత్రిత్వశాఖల నుంచి తప్పుకున్నవారిలో రైల్వే రవాణా వ్యవస్థ, కార్మిక శాఖలకు చెందిన మంత్రులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *