హైదరాబాద్,(జనంసాక్షి): మధ్యాహ్నం ఒంటి గంటకు రెండో విడత పంచాయతీ ఎన్నికలలకు పోలింగ్ ముగియనుంది. ఒంటి గంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల 60 శాతం పైన పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట వార్డు మెంబర్ల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్‌ల ఓట్లను లెక్కింపు సాయంత్రం కల్లా ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు.




