హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం పేదరికాన్ని అపహాస్యం చేస్తోందని భాజపా సీనియర్‌నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ప్రణాళికా సంఘం దేశంలో పేదరికం 21 శాతం ప్రజలకు అహారభద్రత కల్పిస్తామంటూ, మరోవైపు పేదరికం 21శాతానికి తగ్గిందనడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రణాళికా సంఘం ద్వంద ప్రమాణాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




