Tuesday, 3 November 2026

బాలాపూర్‌లో ఎస్సై విక్రమ్‌సింగ్‌ వీరంగం

హైదరాబాద్‌,(జనంసాక్షి): బాలాపూర్‌ ఎస్సై విక్రమ్‌సింగ్‌ సోమవారం వీరంగం సృష్టించారు. బాలాపూర్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత తులసీరాంను ఎస్సై అడ్డుకున్నారు. అయితే తులసీరాం ఎస్సై ఐడీ కార్డును చూపించమని అడిగారు.దాంతో ఎస్సై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తులంసీరాంను హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనపై ఎస్సై విక్రమ్‌సింగ్‌ తన ప్రతాపాన్ని చూపించారు. దీంతో తులసీరాంకు తీవ్రగాయాలు అయినాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *