బులవయో,(జనంసాక్షి):భారత్-జింబాబ్వేల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జట్టు 144 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే ఆటగాడు చింగుబురా 50 పరుగులు సాధించాడు. భారత బౌలర్లు మిశ్రా 3, జడేజా, శర్మ తలో రెండు వికెట్లు ఉన్కదత్, షమీలు చెరో ఒక వికెట్ తీసుకున్నారు. 145 పరుగులు విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.




