Tuesday, 3 November 2026

ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ నది

శ్రీశైలం: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దాంతో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 882.30 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 3 లక్షల 41వేల క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 4లక్షల 72వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో 210.12 టీ ఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, తుంగభద్రల నుంచి 4 లక్షల 12 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయికి చేరుకోగానే డ్యామ్‌ భద్రతా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో శ్రీశైలం డ్యామ్‌ క్రస్టుగేట్లను ఎత్తివేసి దిగువన వున్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *