Tuesday, 3 November 2026

అధిష్ఠానం నిర్ణయానికి సహకరించాలి: టీ.కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయానికి సహకరించాలని అన్ని ప్రాంతాల నేతలను టీ. కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం  హైదరాబాద్‌లో కోరారు. గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు టీ.కాంగ్రెస్‌ ఎంపీలు  శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు ప్రసంగిస్తూ తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందన్నారు.

సీమాంధ్ర నేతలు ఆ తర్వాత ప్రక్రియకు సహకరించలని విజ్ఞప్తి చేశారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు క్రమంలో సీమాంధ్రలో ఇందిరా, రాజీవ్‌ల విగ్రహాలను ధ్వంసం చేయడం దారునమన్నారు. అన్ని ప్రాంతాల కాంగ్రెస్‌ నేతలు ఆ దారునాన్ని ఖండించాలన్నారు. సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు , తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణకు అడ్డుతగలడం సరికాదని టీ.కాంగ్రెస్‌ ఎంపీలు వాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *