అడ్డగూడూరు: మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి (80) ఈ రోజు ఉదయం 5.15 గంటలకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ ఏడాది మే 1 బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. ఉప్పునూతల స్వగ్రామం నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూరు. బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావులు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో ఎమ్మెల్సీగా ఎన్నికై చిన్న నీటి వనరల శాఖామంత్రిగా, అబ్కారీశాఖా మంత్రిగా పనిచేశారు. తదుపరి రామన్న పేట నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డెయిరీ డెవలమెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా, ఏపీఐఐసీకి ఛైర్మన్‌గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఛైర్మన్‌గా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఉప్పునూతల, గత కొంతకాలం కిత్రం వైకాపాలో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు.




