విశాఖ: రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల అవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అవర్తనం ఏర్పడితే రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య ప్రదేశ్ వైపు తరలిపోవడంతో దీని ప్రభావం మన రాష్ట్రంపై ఉండదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. ద్రోణి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈ దురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలోకి వేటుకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.




