ఉప్పునుంతల: మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన మాగాని వెంకటేష్ అనే రైతు విద్యుతు షాకుకు గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ స్వల్పంగా గాయపడ్డాడు. శనివారం అర్థరాత్రి పొలానికి విద్యుత్తు మోటారు ఆన్ చేయడానికి వెళ్లిన రైతు మోటారు ఆన్ చేయడానికి వెళ్లిన రైతు మోటారు వద్ద తెగి పడి ఉన్న తీగలను ప్రమాదవశాత్తూ తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో రైతు తల, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




