హైదరాబాద్,(జనంసాక్షి): వచ్చిన తెలంగాణ అడ్డుకోవడానికి సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేయడం దారుణమన్నారు. రాజీనామాల డ్రామాతో మరోసారి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. టీ టీడీపీ ఫోరం నేతలు బాబును నమ్మి తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని కడియం కోరారు.




